Kamareddy: తండ్రి మరణం.. కూతురికి ‘పరీక్ష’

Kamareddy

(Kamareddy) గుండెపోటుతో తండ్రి మరణించాడు…. ఈ విషయం తెలిసి… ఆపుకోలేని దుఃఖం లోపలి నుంచి ఉబికి వస్తున్నా, పదో తరగతి పరీక్ష రాసి, అంత్యక్రియలకు హాజరై, తర్వాత వచ్చి తండ్రి మృతదేహం పై పడి కూతుళ్లు గుండెల విసిలా రోదించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన బీబీపేట సత్యనారాయణ( 42) (Kamareddy) కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం వెలుగు పత్రిక విలేకరిగా పని చేస్తున్నాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. బుధవారం వేకువ జామున నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, కూతుళ్లు కీర్తన, దీపిక, అనుష ఉన్నారు. జంగంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇద్దరు కూతుళ్లు చదువుతున్నారు. అయితే కీర్తనకు 10 వ తరగతి ఎగ్జామ్ ఉంది. తండ్రి మరణించాడు అన్న విషయం తెలిసి, పుట్టెడు దుఃఖంలో కూడా పరీక్ష రాసేందుకు వెళ్ళింది. పరీక్ష రాసిన వెంటనే తాను, తనతో పాటు చెల్లెలు అనూషను వెంటబెట్టుకొని, తమ బంధువుల ద్విచక్ర వాహనాలపై ఎక్కి, నస్కల్ గ్రామానికి చేరుకొని, తండ్రి మృతదేహం పై పడి డాడీ అంటూ గుండెల విసెలా రోదించడం చూసి పలువురు కంట తడి పెట్టుకున్నారు.

గుండెపోటుతో తండ్రి మరణించాడు…. ఈ విషయం తెలిసి… ఆపుకోలేని దుఃఖం లోపలి నుంచి ఉబికి వస్తున్నా, పదో తరగతి పరీక్ష రాసి, అంత్యక్రియలకు హాజరై, తర్వాత వచ్చి తండ్రి మృతదేహం పై పడి కూతుళ్లు గుండెల విసిలా రోదించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన బీబీపేట సత్యనారాయణ( 42) కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం వెలుగు పత్రిక విలేకరిగా పని చేస్తున్నాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. బుధవారం వేకువ జామున నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, కూతుళ్లు కీర్తన, దీపిక, అనుష ఉన్నారు. జంగంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇద్దరు కూతుళ్లు చదువుతున్నారు. అయితే కీర్తనకు 10 వ తరగతి ఎగ్జామ్ ఉంది. తండ్రి మరణించాడు అన్న విషయం తెలిసి, పుట్టెడు దుఃఖంలో కూడా పరీక్ష రాసేందుకు వెళ్ళింది. పరీక్ష రాసిన వెంటనే తాను, తనతో పాటు చెల్లెలు అనూషను వెంటబెట్టుకొని, తమ బంధువుల ద్విచక్ర వాహనాలపై ఎక్కి, నస్కల్ గ్రామానికి చేరుకొని, తండ్రి మృతదేహం పై పడి డాడీ అంటూ గుండెల విసెలా రోదించడం చూసి పలువురు కంట తడి పెట్టుకున్నారు.

Also read: