చైనా అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (Rahul Gandhi) రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనా దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నదని (Rahul Gandhi) ఆరోపించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరో కీలక వ్యాఖ్య చేశారు. ఇటీవల మన విదేశాంగ కార్యదర్శి, చైనా విదేశాంగ ప్రతినిధితో కలిసి కేక్ కట్ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది దేశ భద్రతా విషయంలో ఆందోళన కలిగించే విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయం లోక్‌సభలో ప్రస్తావించిన ఆయన, సాధారణ పౌరులు వేడుకలు జరుపుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, భారత విదేశాంగ విధానం స్పష్టంగా ఉండాలని, ముఖ్యంగా చైనా ఆక్రమించిన భూభాగం విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెగాసుపట్టుగా ప్రకటించాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
దేశ భద్రత, భూభాగ పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? అన్నదానిపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షం అభిప్రాయపడింది. భారత భూభాగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు
ఈ విషయం లోక్‌సభలో ప్రస్తావించిన ఆయన, సాధారణ పౌరులు వేడుకలు జరుపుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, భారత విదేశాంగ విధానం స్పష్టంగా ఉండాలని, ముఖ్యంగా చైనా ఆక్రమించిన భూభాగం విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెగాసుపట్టుగా ప్రకటించాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
దేశ భద్రత, భూభాగ పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? అన్నదానిపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షం అభిప్రాయపడింది. భారత భూభాగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Also read:
- Warangal: దొంగను పట్టిస్తే ₹10,000 నజరానా
- Supreme: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీం కీలక నిర్ణయం!