Trump: 10 లక్షల కోట్లు ఆవిరి..తగ్గిన బంగారం ధర

Trump

ట్రంప్ (Trump) విధించిన సుంకాల ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్ పై పడింది. ఫలితంగా మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ 931 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 23వేల దిగువకు చేరింది. (Trump) బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ ఉదయం 76,160.09 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,295.36) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,240.55 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 930.67 పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.85.22గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ భారీగా క్షీణించి 67.15 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3118 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Image

తగ్గిన బంగారం ధర
బంగారం ధర తగ్గింది. దూకుడు మీద ఉన్న పసిడి ట్రంప్ సుంకాల దెబ్బకు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం10 గ్రాములకు 1,740 రూపాయలు తగ్గింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 91,640 పలుకుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.84,000 కి చేరుకుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న పరస్పర సుంకాలను ప్రకటించారు. “లిబరేషన్ డే” పేరుతో ప్రతీకార సుంకాలను ప్రపంచంపై వదిలారు. మన దేశం నుంచి అమెరికాకు బంగారు ఆభరణాలు ఎగుమతి అవుతాయి. అక్కడ సుంకం పెంచడంతో ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం బులియన్ మార్కెట్ మీద పడింది. స్థానికంగా గోల్డ్ రేట్లు డౌన్ అయ్యాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రూ.4వేలు భారీ తగ్గింపుతో లక్షా8వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Also read: