WAQF: వక్ఫ్ సవరణ బిల్లు‌కు రాజ్యసభ ఆమోదం

WAQF

వివాదాస్పదమైన వక్ఫ్‌ (WAQF) (సవరణ) బిల్లు – 2025కి పార్లమెంట్ పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది. రాజ్యసభలో సుదీర్ఘంగా 14 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం, (WAQF) ఈ బిల్లు తెల్లవారుజామున ఓటింగ్ ద్వారా ఆమోదం పొందింది. మొత్తం 223 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, 128 మంది అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించారు.

ఈ బిల్లును మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ, ఇది ముస్లింల హక్కులను కాపాడే దిశగా తీసుకొచ్చిన చర్య అని రిజిజు పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, అన్ని తెగల హక్కులను పరిరక్షించడం ఈ బిల్లులో ఉన్న ముఖ్య లక్ష్యాలుగా తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలైతే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ, లోకసభలో బిల్లును బలవంతంగా ఆమోదించారని విమర్శించారు. ఈ బిల్లు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున ఎంపీ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజలను తప్పుదారి పట్టించడమే అధికార పార్టీ ఉద్దేశమని విమర్శించారు.

డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ బిల్లును “ముస్లిం వ్యతిరేక బిల్లు”గా పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ, బీజేపీపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లును చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. థాయ్‌లాండ్‌లో BIMSTEC సదస్సులో ఉన్న మోదీ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, సమగ్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు, కమిటీలు, పౌరుల నుంచి వచ్చిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదాన్ని పొందిన అనంతరం, అధికారిక చట్టంగా అమలులోకి వస్తుంది.

Image

ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లును చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. థాయ్‌లాండ్‌లో BIMSTEC సదస్సులో ఉన్న మోదీ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, సమగ్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు, కమిటీలు, పౌరుల నుంచి వచ్చిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదాన్ని పొందిన అనంతరం, అధికారిక చట్టంగా అమలులోకి వస్తుంది.

Also read: