CM: భద్రాచలంలో మహాసంభరంగా సీతారాముల కల్యాణం

CM

తెలంగాణలోని దక్షిణ సాకేతపురి భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు భద్రాచలం చేరుకొని “జై శ్రీరాం” నినాదాలతో నగరాన్ని మార్మోగించారు. అభిజిత్ లగ్నానికి అనుగుణంగా ఆలయ పండితులు శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ దివ్య ఘట్టానికి (CM) సీఎం రేవంత్ రెడ్డి తన భార్యతో కలిసి హాజరై, ప్రభుత్వ తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన రాజలాంఛనాలను అందజేశారు. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, భక్త రామదాసు వారసులు కూడా కార్యక్రమంలో (CM) పాల్గొన్నారు.

ఈ వేడుకను ఎల్ఈడి స్క్రీన్ల సాయంతో పట్టణ వ్యాప్తంగా ప్రదర్శించడంతో వేలాది మంది భక్తులు కల్యాణ దర్శనం పొందారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రత్యేకంగా పొగమంచు యంత్రాలను సెక్టార్లుగా ఏర్పాటు చేయించారు.

lord ram

ఈ కల్యాణోత్సవం రాముల వారి భక్తులకు సాంప్రదాయ పర్వంగా నిలిచింది. భద్రాచలం ఎప్పుడూ పవిత్రతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ వేడుకలో ప్రజాప్రతినిధుల సమర్పణతో పాటు భక్తుల సంబురం ఆలయాన్ని మేలుకొల్పింది.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి ఆలయానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాజలాంఛనాలు అందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

vithika sheru ambati bargavi

niharika konidela, siddhu soma

ఈ కళ్యాణోత్సవాన్ని కళాకారులు, సినీ ప్రముఖులు కూడా స్వయంగా హాజరై మరింత వైభవాన్ని చేకూర్చారు. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల తన తల్లితో పాటు భక్తిగా వచ్చారు. ఆమెతో పాటు యాక్ట్రెస్ & యూట్యూబర్ వితికా షేరు, అంబటి భార్గవి, ఆమె భర్త ప్రముఖ ఫోటోగ్రాఫర్ సిద్ధు సోమా కూడా పాల్గొన్నారు. వీరి తోలి దర్శనం రాములవారి ఆలయ ప్రాంగణంలో సందడి చేసింది.

మిథిలా స్టేడియంలో నిర్వహించిన ఈ కల్యాణం ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పట్టణమంతా ప్రత్యక్షప్రసారం చేయడంతో వేలాది మంది భక్తులు దూరంగా నుంచే ఈ ఘట్టాన్ని చూశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రత్యేకంగా పొగమంచు యంత్రాలను ఏర్పాటు చేయించారు.

రేపు జరగనున్న శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. భక్తి, సంస్కృతి, సినీ, రాజకీయ రంగాల సమ్మేళనంగా ఈ మహోత్సవం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారింది.

Also read: