అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మళ్లీ వాణిజ్య సుంకాల ప్రకటనలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశారు. దీనివల్ల భారతీయ స్టాక్ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం పడింది. (Trump) సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి విలువ ఆవిరయ్యింది. బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ. 4,03 లక్షల కోట్లుగా ఉండగా, సోమవారం ఉదయం 9:20కి అది రూ. 3,83 లక్షల కోట్లకు పడిపోయింది.
ట్రంప్ సుంకాల ప్రభావం దేశీయ మార్కెట్‌ను మాత్రమే కాక, జపాన్, తైవాన్, సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ తీవ్రంగా కనిపించింది. హాంకాంగ్ మార్కెట్ 9.28% పడిపోయింది, జపాన్‌లో అయితే ఏకంగా 20% క్షీణత నమోదైంది. ఇదే సమయంలో షాంఘై ముడి చమురు ధరలు 7% తగ్గాయి.
ఈ కుదుపులో ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్, బీమా రంగాలు బాగా నష్టపోయాయి. TCS, Infosys, HCL వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ సుంకాలు ముఖ్యంగా ఐటీ ఎగుమతులపై పెంచిన కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని నిపుణుల విశ్లేషణ.
అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో JP Morgan ఈ ఏడాది మాంద్య ప్రమాదాన్ని 60%గా అంచనా వేసింది. ఇప్పటికీ అమెరికా 180 దేశాలపై 10% బేస్ టారిఫ్ వసూలు చేస్తోంది. ట్రంప్ వాణిజ్యలోటును తగ్గించాలన్న ధ్యేయంతో సుంకాలపై వెనక్కి తగ్గే ఆలోచన లేదని స్పష్టం చేయడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. శుక్రవారం 85.24 వద్ద ముగిసిన రూపాయి, సోమవారం 41 పైసలు తగ్గి 85.65 వద్ద ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 10 తర్వాత రూపాయి విలువలో నమోదైన అతిపెద్ద పతనం.
ఈ సంక్షోభం ఇంకా కొనసాగితే, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) తమ పెట్టుబడులను మరింతగా ఉపసంహరించుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌లో రూ. 13,730 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ట్రంప్ పాలన భారతదేశంతో ఒప్పందానికి రాకపోతే, ఈ అమ్మకాలు మరింత వేగవంతం కావచ్చన్నది ఆందోళనకరాంశం.
Also read:

