ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) తన స్వగృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వెలగపూడిలో ఆయన సొంతంగా 5.25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఈ భూమిలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెల్లవారుజామున (CBN) చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమానికి చంద్రబాబు తన కుమారుడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ హాజరై కుటుంబసభ్యులందరూ కలిసిన ఆనందదాయక క్షణాలను గడిపారు. పూజల అనంతరం ప్రత్యేక హోమం నిర్వహించి, శిలాఫలకం ఆవిష్కరించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే మా సంకల్పానికి ఇది ఒక అడుగు. నేను ప్రజల కోసం కలలు కనిన నగరంలోనే నాకూ సొంతింటి నిర్మాణం ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది నా వ్యక్తిగత జీవితానికి మైలురాయే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రేరణ.” అని అన్నారు.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆయన దీర్ఘకాలిక లక్ష్యం ఇప్పుడు మళ్లీ కార్యరూపం దాల్చుతోంది. అప్పట్లో మూడు రాజధానుల ప్రతిపాదనతో పరస్పర రాజకీయాల మధ్య అమరావతి అభివృద్ధి స్థంభించగా, ఇప్పుడు మళ్లీ కొత్త ఉత్సాహంతో ఆ ప్రాజెక్టుకు ఊపొస్తున్నారు.

వెలగపూడిలో చేపట్టిన ఈ నిర్మాణం సాధారణ నివాసం కాకుండా, భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని ఆయన సంకల్పించారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి కొత్త శుభారంభమని పలువురు భావిస్తున్నారు.

Also read: