రాష్ట్రంలో వాతావరణం అసహజంగా మారిపోతోంది. (Alert) ఉదయం వేళల్లో పగటి ఎండ భరించలేనంతగా తాపం పెరుగుతుంటే, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకొని ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరహా వాతావరణం మున్ముందు మరో మూడు నుంచి నాలుగు రోజుల వరకూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు (Alert) హెచ్చరిస్తున్నారు.
ఏం జరుగుతోంది అంటే..?
గత కొంతకాలంగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళల్లో ఆకాశం మేఘరహితంగా ఉండటం వల్ల భూమి తీవ్రంగా వేడెక్కుతోంది. ఈ వేడి వలన గాలిలో తేమ శాతం పెరిగి, స్థానికంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కలిగిస్తున్నాయి.
ఏఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయ్?
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా చోటుచేసుకునే అవకాశముంది. ఈ రెండు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
అంతే కాదు, కామారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వీటి ప్రభావంతో కొందరు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు పడిపోవచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్‌లో వానలు..?
సిటీ వాసులు కూడా వాతావరణం మార్పుతో కాస్త ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాదులోనూ క్యూములో నింబస్ మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షాలు కురవడం కనిపించింది. ఉదయం వేడి పడుతూ ఉండగా, సాయంత్రం వాన వల్ల వాతావరణం చల్లబడింది.
జాగ్రత్తగా ఉండండండి!
ఈ తరహా వాతావరణం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. తడి నేలలు, జారే ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది కనుక వాహనదారులు, పాదచారులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని బయటకు పంపేటప్పుడు వాతావరణ పరిస్థితిని పరిశీలించి పంపించాలంటున్నారు అధికారులు.
Also read:
- Jodhpur: హిజాబ్ కోసం తిరిగి మంటల్లోకి వెళ్లిన యువతి మృతి
- Varanasi: 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్, 9 మంది అరెస్ట్

