ఎర్రబెల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలవదు

ఎర్రబెల్లి

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్లయితే కాంగ్రెస్ ఓడిపోతుందని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

వర్ధన్నపేటలో జరిగిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందో తెలియదు. అందుకే వాళ్లు ఉన్నంతకాలం దోచుకోవాలని చూస్తున్నారు. మంత్రిపదవుల కోసం 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎవరికైనా పదవి ఇచ్చితే మిగతావాళ్లు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతారు” అంటూ ఘాటుగా విమర్శించారు.

Errabelli Dayakar Rao announces upcoming foundation laying for mini textile park

వర్ధన్నపేటలో జరిగిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందో తెలియదు. అందుకే వాళ్లు ఉన్నంతకాలం దోచుకోవాలని చూస్తున్నారు. మంత్రిపదవుల కోసం 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎవరికైనా పదవి ఇచ్చితే మిగతావాళ్లు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతారు” అంటూ ఘాటుగా విమర్శించారు.

రెవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో కేవలం 10 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, “కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలిస్తే వాళ్లు ఏది చెబితే అది చేస్తా” అని బహిరంగంగా ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపగా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిరత, రెవంత్ నేతృత్వంపై బీఆర్ఎస్ శక్తిగా దాడి మొదలుపెట్టినట్లే ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

Errabelli Dayakar Rao advocates for the cultivation of oil palm

Also read: