బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు (Salman Khan) మరో మారు బెదిరింపులు వచ్చాయి. కారులో బాంబులు పెట్టి చంపుతామంటూ ఆగంతకుడు సందేశం పంపాడు. ఈసారి వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు. ఈ సంఘటన తర్వాత వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అధికారులు ఎవరు ఈ మెసేజ్ చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని హతమార్చేందుకు పలు సందర్భాల్లో రెక్కీ కూడా నిర్వహించింది.
దీంతో ఆయనకు ప్రాణహాని ఉండటంతో ప్రభుత్వం ఆయన సెక్యూరిటీని కూడా పెంచింది. కొన్నేండ్లుగా సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖాన్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ గతంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే కృష్ణ జింకల విషయంలో గుడి సందర్శించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా రూ.5 కోట్లు చెల్లించాలని గతంలో డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో మారు బెదిరింపులు వచ్చాయి. కారులో బాంబులు పెట్టి చంపుతామంటూ ఆగంతకుడు సందేశం పంపాడు. ఈసారి వర్లిలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వచ్చింది. బెదిరింపుల్లో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు. ఈ సంఘటన తర్వాత వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అధికారులు ఎవరు ఈ మెసేజ్ చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని హతమార్చేందుకు పలు సందర్భాల్లో రెక్కీ కూడా నిర్వహించింది.

Also read: