Rangareddy: కారు డోర్ లాక్ అయి ఇద్దరు చిన్నారులు మృతి

Rangareddy

రంగారెడ్డి (Rangareddy) జిల్లా, ఏప్రిల్ 14 – రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఇద్దరు చిన్నారుల విషాదాంతం చోటుచేసుకుంది. ఆటలాడుకుంటూ ఉన్న చిన్నారులు అనుకోకుండా తమ ప్రాణాలు కోల్పోయారు. అన్నీ క్షణాల్లో జరిగిపోయే విషాద ఘటనగా మారింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకుంటూ చక్కర్లు కొడుతున్న తన్మయశ్రీ (5) మరియు అభినయశ్రీ (4) అనే చిన్నారులు కారులోకి ఎక్కి లోపల నుండి డోర్లు మూసివేశారు. కొద్దిసేపటికి ఆ డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ (Rangareddy) అయ్యాయి.

దీంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిన చిన్నారులు తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే వారిద్దరూ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.ఈ సంఘటనతో ఆ కుటుంబం గానీ, గ్రామస్తుల గుండెల్లో కారం పూసినట్లైంది. ఆ ఇద్దరు చిన్నారులు అల్లారుముద్దుగా పెంచుకున్న వాళ్లని తెలియడంతో చుట్టుపక్కల ఎక్కడికక్కడ కన్నీటి విలయం నెలకొంది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చిన్నారుల మృతికి గల కారణాలపై పూర్తి విచారణ జరుపుతున్నారు.

రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 14 – రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఇద్దరు చిన్నారుల విషాదాంతం చోటుచేసుకుంది. ఆటలాడుకుంటూ ఉన్న చిన్నారులు అనుకోకుండా తమ ప్రాణాలు కోల్పోయారు.అన్నీ క్షణాల్లో జరిగిపోయే విషాద ఘటనగా మారింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకుంటూ చక్కర్లు కొడుతున్న తన్మయశ్రీ (5) మరియు అభినయశ్రీ (4) అనే చిన్నారులు కారులోకి ఎక్కి లోపల నుండి డోర్లు మూసివేశారు. కొద్దిసేపటికి ఆ డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అయ్యాయి.

Also read: