తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Stalin) మరో సారి దేశ రాజకీయాల్లో కీలక చర్చను మొదలుపెట్టారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి (Autonomy) కోసం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు సరైన అధికారాల మార్గదర్శకత కోసం హై లెవల్ కమిటీను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వం (Stalin) వహించనున్నారు.
కమిటీ స్థాపనకు నేపథ్యం:
ఇటీవలి కాలంలో కేంద్రం తరఫున రాష్ట్రాల మీద హస్తక్షేపం పెరిగిందన్న ఆరోపణలు పలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వ్యవహారాలు, కేంద్ర బలగాల నియామకం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కేంద్ర విధానాలు రాష్ట్రాధీనానికి విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు పలు రాష్ట్రాల నుండి వచ్చిన నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పడింది.
ఉమ్మడి జాబితాలోకి వెళ్లిన విషయాలను తిరిగి రాష్ట్ర అధికార పరిధిలోకి తీసుకురావడం కూడా ఈ కమిటీ ముఖ్య బాధ్యతగా ఉండనుంది. ఇది ముఖ్యంగా విద్య, వనరులు, వ్యవసాయ నియంత్రణ, నీటి పంపిణీ, వైద్యం వంటి అంశాల్లో కీలకంగా ఉంటుంది.
నివేదిక సమర్పణ గడువు:
ఈ కమిటీ జనవరి 2026 నాటికి తాత్కాలిక నివేదికను, 2028 నాటికి తుది నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా, తమిళనాడు ప్రభుత్వమే కాకుండా, ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా తమ హక్కులను రక్షించుకునే మార్గాలను అన్వేషించగలుగుతాయి.
స్టాలిన్ వ్యాఖ్యలు:
“దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడటం, రాష్ట్రాలకు అర్థవంతమైన పాలన ఇవ్వడం మా ముఖ్య లక్ష్యం. ఇది తమిళనాడుకే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షించే పోరాటం” అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
అలాగే, ఈ కమిటీ ద్వారా చట్టపరమైన మూల్యాంకనంతో పాటు కేంద్ర-రాష్ట్ర సంబంధాల పునర్నిర్వచనానికి మార్గం వేయనున్నారు. స్టాలిన్ తీసుకున్న ఈ అడుగు దేశ రాజకీయాల్లో ఫెడరలిజంపై కొత్త దిశలో చర్చలకు దారితీయనుంది.
Also read:

