ED: ఈడీ విచారణకు ప్రియాంక గాంధీ భర్త

ED

హర్యానా భూముల కేసు మరోసారి ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాను (ప్రియాంక గాంధీ భర్త) చిక్కుల్లోకి నెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే ఆయనకు మార్చ్ 8న సమన్లు జారీ చేసినా, వాద్రా హాజరుకాలేదు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. (ED) నోటీసులు అందిన వెంటనే రాబర్ట్ వాద్రా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Image

కేసు నేపథ్యం – భూముల కొనుగోలు & విక్రయాల్లో అనుమానాస్పద లావాదేవీలు

ఈ కేసు ఫిబ్రవరి 2008లో ప్రారంభమైంది. వాద్రాకు చెందిన కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌ అనే సంస్థ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్ ప్రాంతంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
అతితక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూమిని, కొద్ది నెలలకే రూ.58 కోట్లకు డీఎల్‌ఎఫ్ (DLF) సంస్థకు అమ్మినట్లు రికార్డులు చూపుతున్నాయి.

ఈ లావాదేవీల్లో భూముల విలువను తక్కువ చూపించి, బ్యాంకుల నుంచి రుణాలు పొందటం, మరియు అక్రమ మార్గాల్లో లాభాలు పొందటం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై మనీలాండరింగ్ నివేదికలో స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు సమాచారం.

Image
వాద్రా స్పందన – ఇది రాజకీయ ప్రతీకారం!

ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ:

“ప్రతి సారి నేను ప్రజల తరఫున గొంతు వినిపిస్తే… వెంటనే కేంద్రం నన్ను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపుల చర్య. అయినా నేను ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.” అని పేర్కొన్నారు.


రాజకీయ నేపథ్యం
  • రాబర్ట్ వాద్రా పేరు గతంలోనూ అనేక ఆస్తుల కేసుల్లో వినిపించింది.

  • 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాద్రాపై ఓవరసీస్ ఆస్తుల కేసులపైనా విచారణ జరిగింది.

  • ప్రియాంక గాంధీ వరుసగా ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టడంతో, కేంద్రం కావాలని ఈ తరహా చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Image

రాజకీయ నేపథ్యం
  • రాబర్ట్ వాద్రా పేరు గతంలోనూ అనేక ఆస్తుల కేసుల్లో వినిపించింది.

  • 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాద్రాపై ఓవరసీస్ ఆస్తుల కేసులపైనా విచారణ జరిగింది.

  • ప్రియాంక గాంధీ వరుసగా ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టడంతో, కేంద్రం కావాలని ఈ తరహా చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Also read: