Gavai: కొత్త సీజేఐగా బీఆర్ గవాయ్!

Gavai

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బీఆర్​ గవాయ్​ (Gavai) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. దీంతో ఆయన న్యాయ శాఖ సూచన మేరకు తన వారసుడిగా జస్టిస్​ బీఆర్ గవాయ్​ (Gavai) పేరును సిఫార్సు చేశారు. జస్టిస్​ గవాయ్​ 14న భాద్యతలు స్వీకరిస్తారు. సీజేఐగా ఆరు నెలల పాటు ఆయన పనిచేస్తారు. జస్టిస్​ కేజీ బాలకృష్ణన్​ తర్వాత ఆ పదవిని అలంకరించనున్న రెండో దళితుడు జస్టిస్​ గవాయ్​. గవాయ్‌ పూర్తిపేరు భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. ఆయన 1960 నవంబర్‌ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్‌లో సభ్యుడిగా చేరారు. 1987 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1992లో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేవలందించారు. నవంబర్ 14 , 2003న బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2005లో అక్కడే పూర్తి కాలం న్యాయమూర్తిగా పదవీకాలం పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న గవాయ్..2025 నవంబర్ 23వ తేదీ వరకు పనిచేస్తారు.

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బీఆర్​ గవాయ్​నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. దీంతో ఆయన న్యాయ శాఖ సూచన మేరకు తన వారసుడిగా జస్టిస్​ బీఆర్ గవాయ్​ పేరును సిఫార్సు చేశారు. జస్టిస్​ గవాయ్​ 14న భాద్యతలు స్వీకరిస్తారు. సీజేఐగా ఆరు నెలల పాటు ఆయన పనిచేస్తారు. జస్టిస్​ కేజీ బాలకృష్ణన్​ తర్వాత ఆ పదవిని అలంకరించనున్న రెండో దళితుడు జస్టిస్​ గవాయ్​. గవాయ్‌ పూర్తిపేరు భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. ఆయన 1960 నవంబర్‌ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్‌లో సభ్యుడిగా చేరారు. 1987 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1992లో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేవలందించారు. నవంబర్ 14 , 2003న బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2005లో అక్కడే పూర్తి కాలం న్యాయమూర్తిగా పదవీకాలం పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న గవాయ్..2025 నవంబర్ 23వ తేదీ వరకు పనిచేస్తారు.

Also read: