J&K: కాశ్మీర్ లో హై అలెర్ట్

J&K

జమ్మూ కాశ్మీర్ (J&K) లోని పహల్గాం జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం భారీ సంఖ్యలో రంగంలోకి దిగింది. ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతున్నాయి. నిన్న దాడి తర్వాత సమీపంలోనే ముష్కరులు నక్కి ఉంటారని భావిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు వెతుకలాట ప్రారంభించాయి. మరోవైపు (J&K) జమ్మూలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు నిర్వహించారు.

Image

ఉగ్రవాదులను మట్టుబెట్టాలని డిమాండ్ చేశారు. నిన్న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఆర్మీ డ్రెస్ లలోనే రావడంతో అక్కడి ప్రజలు సైన్యాన్ని చూసి వణికిపోతున్నారు. మరో వైపు పాకిస్థాన్-భారత్ బోర్డర్‌లో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ వైమానిక దళాలు సరిహద్దు వైపు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తం అయింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు టెండ్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5నుంచి ఏడుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ ఉగ్రవాదులంతా కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల్ని ఏమి చేయలేదు. వారి జోలికి కూడా రాలేదు. ఒకవేళ అడ్డొచ్చినా ఏమీ చేయలేదు.

Also read: