కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం గాడి తప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ ఎక్స్ లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవు.
మాజీ సర్పంచ్ ల బిల్లులకే మోక్షం లేదు’ అని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనను ఆయన స్వర్ణయుగంగా పోల్చారు. సమైక్య పాలనలో దగాపడ్డ పల్లెలను సొంత రాష్ట్రంలో కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం అన్నారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మురిసిన పల్లె ప్రస్తుతం కన్నీరు (KTR) పెడుతుందన్నారు.
![]()
కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం గాడి తప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ ఎక్స్ లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు.
![]()
చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవు. మాజీ సర్పంచ్ ల బిల్లులకే మోక్షం లేదు’ అని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనను ఆయన స్వర్ణయుగంగా పోల్చారు.

సమైక్య పాలనలో దగాపడ్డ పల్లెలను సొంత రాష్ట్రంలో కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం అన్నారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మురిసిన పల్లె ప్రస్తుతం కన్నీరు పెడుతుందన్నారు.
Also read:

