Prime Minister Modi: ఉగ్రవాదులను వెతికి శిక్షిస్తం

Prime Minister Modi

ఉగ్రవాదులు ఎక్కడున్న వెతికి పట్టుకుంటామని, వాళ్లు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధాన మంత్రి (Prime Minister Modi) నరేంద్ర మోదీ  అన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పహెల్గాం మృతులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది.

క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది. ఓ సోదరికి భర్త దూరమయ్యాడు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యటకులపై జరిగిన దాడి కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసం.పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష లుంటాయి. ప్రతి ఉగ్రవాదినీ ట్రాక్‌ చేసి, శిక్షిస్తామని యావత్‌ భారతీయులకు హామీ ఇస్తున్నా. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తాం. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు’’ అని ప్రధాని (Prime Minister Modi) గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. సింధు నది జలాల ఒప్పందం’’ రద్దు చేయడంతోపాటు సరిహద్దుల్లోని అట్టారీ-వాఘా బోర్డర్‌ని క్లోజ్ చేసింది. పాక్ దౌత్యకార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. దీనిపై పాకిస్తాన్ ఇంధన మంత్రి అవాయిస్ లెఘారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిర్లక్ష్యంగా నిలిపివేయడం జలయుద్ధ చర్య. భారత్ ది పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య. ప్రతి చుక్క మాదే. మేం పూర్తి శక్తితో చట్టబద్ధంగా, రాజకీయంగా, ప్రపంచవ్యాప్తంగా అడ్డుకుంటాం. ’’ అని పేర్కొన్నారు. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం మేరకు సింధు నది నుంచి 80% నీటిని భారతదేశం, దిగువన ఉన్న పాకిస్తాన్ వినియోగించుకుంటోంది. అయితే, పలు సందర్భాల్లో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం చేసినా, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పటికీ భారత్ ఈ ఒప్పందం జోలికి వెళ్లలేదు. తాజాగా, పహల్గామ్ దాడి తర్వాత భారత్ పూర్తిస్థాయిలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Also read: