హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంపార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎక్స్ ట్రా రాలేదు. తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక (Hyderabad) ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలె: గౌతం రావు
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటు వేయకుండా అడ్డుకోవడంపై ఎన్నికల క మిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ అభ్యర్థి గౌతం రావు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు వేయొద్దని ఎలా చెబుతారని అన్నారు. కార్పొరేటర్లను ఓట్లు వేయొద్దని చెప్పిన నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Also read: