Anganwadi: రేపటి నుంచి అంగన్ వాడీలకు సెలవులు

Anganwadi

రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న (Anganwadi) అంగన్​వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు మండుతున్న నేపథ్యంలె రేపటి నుంచి నెల రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏండ్ల నుంచి చిన్నారుల పేరెంట్స్ , అంగన్​వాడీ (Anganwadi) యూనియాన్ల నుంచి వేసవి సెలవులు ప్రకటించాలనే డిమాండ్​ఉంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క చొరవతో ఏండ్ల నాటి డిమాండ్​ నెరవేరింది. ఇవాళ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్​లో అంగన్​వాడీ యానియాన్లతో డైరెక్టర్ ​కాంతి వెస్లీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటుగా అంగన్​వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిన్నారులకు, గర్భిణిలు, బాలింతలకు టేక్​హోం రేషన్​ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనున్నారు. అంతేకాక అంగన్​వాడీ టీచర్లకు సెలవుల్లో ఇతర విధులు అందించేలా చర్యలు చేపట్టారు. ఇంటింటి సర్వే, హోం విపిట్స్​, అంగన్​వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, చిన్నారులకు కాస్త ఉపశమనం లభించనుంది. అంగన్​వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి చొరవ చూపిన మంత్రి సీతక్క కు అంగన్​వాడీ యూనియన్లు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Image

రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్​వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఎండలు మండుతున్న నేపథ్యంలె రేపటి నుంచి నెల రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏండ్ల నుంచి చిన్నారుల పేరెంట్స్ , అంగన్​వాడీ యూనియాన్ల నుంచి వేసవి సెలవులు ప్రకటించాలనే డిమాండ్​ఉంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క చొరవతో ఏండ్ల నాటి డిమాండ్​నెరవేరింది. ఇవాళ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్​లో అంగన్​వాడీ యానియాన్లతో డైరెక్టర్​కాంతి వెస్లీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటుగా అంగన్​వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Image

సెలవుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిన్నారులకు, గర్భిణిలు, బాలింతలకు టేక్​హోం రేషన్​ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనున్నారు. అంతేకాక అంగన్​వాడీ టీచర్లకు సెలవుల్లో ఇతర విధులు అందించేలా చర్యలు చేపట్టారు. ఇంటింటి సర్వే, హోం విపిట్స్​, అంగన్​వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, చిన్నారులకు కాస్త ఉపశమనం లభించనుంది. అంగన్​వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి చొరవ చూపిన మంత్రి సీతక్క కు అంగన్​వాడీ యూనియన్లు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Also read: