Gold : గోల్డ్ రేట్ డౌన్

gold rate down

పరుగులు పెట్టిన పసిడి ధర దిగొస్తోంది. ఇవాళ ఒక్క రోజే బంగారం (Gold) 10 గ్రాములపై ధర దాదాపు రూ.2వేల పైన తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,180 తగ్గి రూ.95,730 పలుకుతోంది. దాదాపు 10 రోజుల్లో పసిడి ధర దాదాపు రూ.5వేల మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం(Gold) ధర కాస్త దిగొచ్చింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందానికి సంకేతాలు కన్పించడం, డాలర్‌ విలువ బలపడుతుండటంతో పుత్తడికి గిరాకీ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు పసిడి ధర దిగొచ్చినట్లు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఔన్సు ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందానికి సంకేతాలు కన్పించడం, డాలర్‌ విలువ బలపడుతుండటంతో పుత్తడికి గిరాకీ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు పసిడి ధర దిగొచ్చినట్లు పేర్కొంటున్నారు.

Also read :

phalgum: పత్తాలేని పాక్​ ఆర్మీ చీఫ్​

Kolkata: కోల్ కతాలో అగ్ని ప్రమాదం 14 మంది సజీవ దహనం