సామాజిక తెలంగాణ సాధించుకోలేక పోయాం భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా సామాజిక తెలంగాణ సాధించుకోలేక పోయామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె (K Kavitha) మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షల రూపాయలుంటే వికారాబాద్ జిల్లాలో లక్షా 58 వేలేనని అన్నారు.

పది కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాద కరమని అన్నారు. రైతు బంధు కింద ఎకరం ఉంటే పది వేలు ఇచ్చామని, పదెకరాలు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చామని తెలిపిన కవిత భూమిలేని కార్మికుల విషయంలో ఏమీ చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో భూమి ఉన్నా.. లేకున్నా ఎలా ఆదుకోవాలే అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ఇస్తుందని కవిత తెలిపారు.
Also read :

