పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో(India) భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశంపై వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్టు (India) భారత్ ప్రకటించింది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ-వాఘా బార్డర్ మాత్రమే. ఇప్పటికే దాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. 2019లో పుల్వామా దాడి తర్వాత దాయాది నుంచి మనం చాలావరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం ఇప్పటికే 200శాతం సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటివే అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్‌కు 447.65 మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా.. అక్కడినుంచి 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులనే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే.

పాక్ కు భారీ నష్టం
పాక్‌లోని కొన్ని పరిశ్రమలు భారత్‌కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యుయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్‌లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పాకిస్థాన్ జెండాతో ఉన్న ఓడలు బారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఆ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశంపై వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ-వాఘా బార్డర్ మాత్రమే. ఇప్పటికే దాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. 2019లో పుల్వామా దాడి తర్వాత దాయాది నుంచి మనం చాలావరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం ఇప్పటికే 200శాతం సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటివే అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్‌కు 447.65 మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా.. అక్కడినుంచి 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులనే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే.

Also read: