జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో కొందరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీన్ని బిఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఈ క్రమంలో (BSF) బిఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఏడుగురు జైషే మహ్మద్ చొరబాటుదారులు హతమయ్యారు. ధన్‌ధర్ పోస్ట్ నుండి సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ రేంజర్లు వారికి చొరబాటుకు సహాయం చేస్తున్నారని (BSF) బీఎస్ఎఫ్ తెలిపింది. భారతదేశ సైనిక చర్య పాకిస్తాన్ పోస్ట్‌కు కూడా నష్టం కలిగించింది. మే 8, 9 తేదీల మధ్య రాత్రి సాంబా సెక్టార్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల బృందాన్ని నిఘా గ్రిడ్ గుర్తించిందని బిఎస్ఎఫ్ తెలిపింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. పాక్ రేంజర్లు వారి చొరబాటుకు సహకరిస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. సహకరించిన పాక్ సైనిక పోస్టును కూడా మన జవాన్లు మట్టుబెట్టారు. భారత సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనిక స్థావరాలు, నగరాలను లక్ష్యంగా చేసుకొని విఫలమైన పాక్ ఇలా దొంగదెబ్బ తీసేందుకు చొరబాట్లను చేయిస్తోంది.
భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ముంచెత్తుతున్నాయి. యుద్ధ భయాల వేళ.. ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వాట్సప్‌లో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజులు ఏటీఎంలు మూసివేస్తారనేది ఈ వార్త సారాంశం. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది ఫేక్ వార్త అని స్పష్టం చేసింది. అవి ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలిపింది.
హజీరా పోర్టుపై దాడి జరగలే
గుజరాత్‌లోని పోర్టు సహా, జలంధర్‌లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అవన్నీ అవాస్తవేమనని తేల్చింది. ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించినదని ఫ్యాక్ట్‌చెక్‌లో క్లారిటీ ఇచ్చింది. ఇక, జలంధర్‌లో డ్రోన్ దాడి అంటూ వస్తోన్న దృశ్యాలు.. ఓ అగ్ని ప్రమాదానికి సంబంధించినవని తెలిపింది.
యుద్ధ సమయాల్లో బ్లాక్ అవుట్ అనే పదం తరుచుగా వాడుతూ ఉంటారు. శత్రువుల నిఘా నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ప్రకటించే ఈ బ్లాక్ అవుట్‌తో యుద్ధ సమయంలో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులకు మన ప్రాంతాలు కనిపించకుండా ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఆయా ప్రాంతాలను పూర్తి చీకట్లోకి నెట్టేయడాన్నే బ్లాక్ అవుట్ అంటారు. ఈ సమయంలో మొత్తం పవర్ కట్ చేస్తారు. వాహనాలను కూడా లైట్లు వేసుకొని తిరిగేందుకు అనుమతి ఇవ్వరు. దీని ద్వారా శత్రువులు మన ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. బ్లాక్ అవుట్ అమల్లోకి వస్తే ఆర్మీ సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Also read:

