ఆపరేషన్ సిందూరు వేళ.. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. (CyberCrimes) ఎవరైనా ఆర్మీ అధికారి పేరుతో డొనేషన్ అడిగితే వెంటనే అనుమానించాలని, ఎలాంటి డబ్బులు చెల్లించవద్దన్నారు .‘ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిని నమ్మి చాలా మంది డబ్బులు చెల్లిస్తున్నారు. (CyberCrimes) ఒకవేళ అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దేశభక్తిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సైబర్ నేరగాళ్లు తమ దందాను పెంచుకోవడానికి అవకాశంగా మలుచుకుంటున్నారు.’ అని సీపీ సజ్జనార్ ట్వీట్చేశారు.
ఆపరేషన్ సిందూరు వేళ.. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరైనా ఆర్మీ అధికారి పేరుతో డొనేషన్ అడిగితే వెంటనే అనుమానించాలని, ఎలాంటి డబ్బులు చెల్లించవద్దన్నారు .‘ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిని నమ్మి చాలా మంది డబ్బులు చెల్లిస్తున్నారు. ఒకవేళ అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దేశభక్తిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సైబర్ నేరగాళ్లు తమ దందాను పెంచుకోవడానికి అవకాశంగా మలుచుకుంటున్నారు.’ అని సీపీ సజ్జనార్ ట్వీట్చేశారు.
Also read:

