IshaqDar: భారత్​ దాడిలో 11 ఎయిర్​బేస్​లు దెబ్బతిన్నయ్​

IshaqDar

భారత సాయుధ దళాలు జరిపిన దాడిలో తమ దేశంలోని 11 ఎయిర్​బేస్​లు దెబ్బతిన్నట్లు పాకిస్తాన్​ ఉప ప్రధాని ఇషాక్​ దార్​ (IshaqDar) అంగీకరించారు. ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా తమ ఎయిర్​బేస్​లపై ఇండియన్​ మిసైల్స్ దాడి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారత్​తో జరిగిన సైనిక దాడిలో తమ విమానం ఒకటి స్వల్పంగా ధ్వంసం అయినట్లు పాక్​ సైన్యం కూడా అంగీకరించింది. అయితే ధ్వంసమైన జెట్​కు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎయిర్​ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్​ ఆర్మీ అధికార (IshaqDar) ప్రతినిధి లెఫ్టినెంట్​ జనరల్​ అహ్మద్​ షరీఫ్​ చౌదరి ఆపరేషన్​ బన్యాన్​–ఉమ్​–మర్సూస్​ ముగిస్తున్నట్లు చెప్పారు. భారత పైలెట్లు ఎవరూ తమ కస్టడీలో లేరని చెప్పారు.

భారీ నష్టం కలిగించిన భారత్​
నిజానికి ఆపరేషన్​ సిందూర్​తో భారత సాయుధ దళాలు పాకిస్తాన్​కు భారీ నష్టం కలిగించాయి. కొన్ని ఫైటర్ జెట్లను కూల్చేశాయి. రాజధాని ఇస్లామాబాద్​ సమీపంలోని కీలక మిలిటరీ స్థావరాలకు నష్టం చేశాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం ప్రతిరోజూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలు చేపట్టింది. మూడు రోజుల పాటు ఆ దేశ కీలక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు విరుచుకుపడటంతో కాల్పుల విమరణకు అంగీకరించి కూడా కొన్ని గంటల్లోనే తిరిగి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇరు దేశాల డీజీఎంవోల చర్చలకు ఒకరోజు ముందు ఎలాంటి కాల్పులకు దిగని పాక్​… తాజాగా ఇవాళ తాము నష్టపోయిన విషయాన్ని అంగీకరించింది.

Also read: