FACEBOOK: ఫేస్ బుక్ డౌన్ పై మీమ్స్ అటాక్

instagram

ఫేస్ బుక్(FACEBOOK), ఇన్ స్టా గ్రాం డౌన్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. త్రెడ్స్ కూడా ఓపెన్ కాకపోవడంతో గుస్సా అవుతున్నారు. ఫేస్ బుక్(FACEBOOK) అధినేత మార్క జూకర్ బర్గ్ ను ట్రోల్ చేస్తున్నారు. ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు వెళ్లారా..? అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు. జూకర్ బర్గ్ మంచం పట్టిన ఫొటోనూ ట్రోల్ చేస్తున్నారు. పక్కనే ఎలెన్ మాస్క్ బర్గ్ ను ఆటపట్టిస్తున్న ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇంకా కొందరు మీమ్ వీడియోలను వాట్సాప్ గ్రూప్ లలో వదులుతున్నారు. 

వాట్సాప్ లోనూ సమస్యలు స్టార్ట్!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌తో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నామని కొందరు యూజర్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పలువురు నెటిజన్లు.. ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తమ సమస్యలను వివరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌‌ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా ఎర్రర్ వస్తుందని, పేజీలు లోడ్ కావడం లేదని పేర్కొంటున్నారు.

inst

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో 2024లో ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద అంతరాయంగా చెబుతున్నారు. తమ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సేవల అంతరాయానికి మెటా ప్రతిస్పందించలేదు. అంతరాయాన్ని తొలగించి.. సేవలను పునఃప్రారంభించడానికి సర్వర్‌లు ఎంత సమయం తీసుకుంటాయనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో యూజర్లు మాటిమాటికి ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

Also Read
CyberAttack: సైబర్ఎటాక్ జరిగిందా?
INSTAGRAM: ఇన్ స్టా ఆగమైందట.. అరేయ్ ఏం చేశార్రా?