మోడల్ శీతల్ (Sheethal) హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. శీతల్ మృతదేహం ఓ కాలువలో పడి ఉండటం ఆమె గొంతు కోసి ఉండటంతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఒక్కరోజులో నిందితులెవరో తేల్చేశారు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న ఆమె (Sheethal) ప్రియుడు సునీల్ ఈ హత్యకు ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సునీల్, మోడల్ శీతల్ చౌదరి మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది. అది త్వరలోనే శారీరక హింసగా మారింది. సునీల్ ఆమెను చాలాసార్లు కొట్టి, పొడిచి, ఆమె మృతదేహాన్ని కాలువలో పడవేసాడు. పానిపట్‌లోని ఒక ఆసుపత్రిలో సునీల్ చికిత్స పొందుతున్నాడు. తాను శీతల్(సిమి)ని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ఈ నెల 14న శీతల్ ఆల్బమ్ షూట్ కోసం పానిపట్‌లోని అహార్ గ్రామానికి వచ్చింది. రాత్రి 10.30 గంటలకు, సునీల్ తన స్నేహితురాలిని కలవడానికి అక్కడికి వచ్చాడు. అతను ఆమెను తన కారు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ మద్య సేవించారు. ఈ సందర్భంగా వాదన మొదలై హత్యదాకా వెళ్లింది. తెల్లవారు జామున 1. 30 గంటల ప్రాంతంలో శీతల్ పానిపట్‌లో ఉన్న తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి సునీల్ తనను కొడుతున్నాడని తెలిపింది. ఆ తర్వాత, శీతల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆమె మరోమారు సంప్రదించలేక పోయింది. మరుసటి రోజు కాలువలో శవమై కనిపించింది. శీతల్ శరీరంపై అనేక కత్తిపోట్లను కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అది త్వరలోనే శారీరక హింసగా మారింది. సునీల్ ఆమెను చాలాసార్లు కొట్టి, పొడిచి, ఆమె మృతదేహాన్ని కాలువలో పడవేసాడు. పానిపట్‌లోని ఒక ఆసుపత్రిలో సునీల్ చికిత్స పొందుతున్నాడు. తాను శీతల్(సిమి)ని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ఈ నెల 14న శీతల్ ఆల్బమ్ షూట్ కోసం పానిపట్‌లోని అహార్ గ్రామానికి వచ్చింది. రాత్రి 10.30 గంటలకు, సునీల్ తన స్నేహితురాలిని కలవడానికి అక్కడికి వచ్చాడు. అతను ఆమెను తన కారు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ మద్య సేవించారు. ఈ సందర్భంగా వాదన మొదలై హత్యదాకా వెళ్లింది. తెల్లవారు జామున 1. 30 గంటల ప్రాంతంలో శీతల్ పానిపట్‌లో ఉన్న తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి సునీల్ తనను కొడుతున్నాడని తెలిపింది. ఆ తర్వాత, శీతల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆమె మరోమారు సంప్రదించలేక పోయింది. మరుసటి రోజు కాలువలో శవమై కనిపించింది. శీతల్ శరీరంపై అనేక కత్తిపోట్లను కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Also read:

