తమిళనాడు తీరంలో ఇటీవల ఓ విచిత్రమైన చేప (Oarfish) కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూడటానికి పొడవుగా, మెరిసే వెండిరంగులో ఉండే ఈ చేప పేరు ఓర్ ఫిష్ (Oarfish). దీన్ని కొన్ని చోట్ల డూమ్స్‌డే ఫిష్గా కూడా పిలుస్తారు. అంటే… ఇది సముద్ర ఉపరితలానికి వచ్చిందంటే రాబోయే ప్రమాదాలకు సంకేతంగా భావిస్తారు.
ఓర్ ఫిష్ గురించి సాధారణ ప్రజల్లోనే కాదు, శాస్త్రవేత్తల్లో కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇది సాధారణంగా సముద్రపు లోతుల్లో ఉండే చేప. ఎప్పటికప్పుడు కనిపించదూ. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది సముద్రపు పై భాగానికి వస్తుంది. ఈ చేప పొడవు సుమారుగా 11 మీటర్ల వరకు ఉండవచ్చు. దాని శరీరం వెండిరంగులో మెరుస్తుంటుంది. తల భాగంలో ఎరుపు రంగు పింఛం లాంటి ఆకారం ఉండడం వల్ల అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇది ఎక్కువగా పాచిని తింటూ జీవించేది. దీని కదలికలు చాలా నెమ్మదిగా ఉండేలా ఉండటంతో దీన్ని కొందరు “సోమరి చేప” అని కూడా పిలుస్తారు.
2025 మే నుండి ఇప్పటి వరకు ప్రపంచంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ చేప కనిపించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. తాజాగా తమిళనాడులో కూడా ఇది బయట పడింది. వైరల్ వీడియోలలో ఏడుగురు వ్యక్తులు దీన్ని పట్టుకొని ఉన్న దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జపనీస్ పురాణాల ప్రకారం, ఓర్ ఫిష్ భూమికి ఆపత్తులు రావడానికి ముందు కనిపిస్తుందని నమ్మకం. భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే ముందు ఇది ఉపరితలానికి రావచ్చనే నమ్మకంతో దీన్ని “డూమ్స్‌డే ఫిష్”గా పిలుస్తున్నారు. అయితే శాస్త్రీయంగా చూస్తే, ఈ నమ్మకానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, దీని అజ్ఞాత ప్రవర్తన కారణంగా ఇది మానవులు ఊహించని భయాలను కలిగిస్తోంది.
అసలు కారణం ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ అరుదైన చేప మనకు ప్రకృతి మాయాజాలాన్ని గుర్తు చేస్తుంది. సముద్రాల లోతుల్లో ఇంకా ఎన్నో రహస్య జీవులు ఉండొచ్చని దీన్ని చూస్తేనే తెలుస్తోంది.
Also read:
