కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi sanjay) సన్నిహితులు, సిబ్బంది ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్వీటీ పోలీసులు ట్యాప్ చేసినట్టు తేలింది. సిట్ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బండి సంజయ్ కి అత్యంత సన్నిహితుడు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు ప్రవీణ్ రావుకు సిట్ అధికారులు ఇవాళ ఫోన్ చేశారు. జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చి రిపోర్ట్ చేయాలని సూచించారు. 317 జీవో, టెన్త్ పేపర్ లీకేజీ, భైంసా అల్లర్లుసహా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు ఘటనల్లో ప్రవీణ్ రావు, అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రస్తుత కేంద్ర మంత్రి సంజయ్(Bandi sanjay) తోపాటు వెన్నంటే ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బండి సంజయ్ లక్ష్యంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తన ఫోన్ తోపాటు తన కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ బండి సంజయ్ గతంలో పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజమని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని గతంలోనే సిట్ నిర్ధారించింది. తాజాగా ఆయన వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది .
317 జీవో, టెన్త్ పేపర్ లీకేజీ, భైంసా అల్లర్లుసహా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు ఘటనల్లో ప్రవీణ్ రావు, అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రస్తుత కేంద్ర మంత్రి సంజయ్తో పాటు వెన్నంటే ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బండి సంజయ్ లక్ష్యంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తన ఫోన్ తోపాటు తన కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ బండి సంజయ్ గతంలో పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజమని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని గతంలోనే సిట్ నిర్ధారించింది. తాజాగా ఆయన వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది .
Also Read :

