బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని(Padi Kaushik Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిన్న అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హనుమకొండలోని సుబేదారి పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమయంలో కమలాపూర్ మండలంలోని గుండేడు, పంగిడిపల్లి శివార్లలో ఉన్న గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి ఏప్రిల్ 21న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బీఎన్ఎస్ 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాల్సిందిగా కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 16న విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాల్సిందిగా ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను(Padi Kaushik Reddy) అరెస్టు చేశారు.

సుబేదారి వద్ద హై టెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సుబేదారి స్టేషన్ వద్ద రాత్రి నుంచే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సెంట్రల్ జోన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పోలీసులను సుబేదారి పీఎస్ వద్ద మోహరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది. పాడి అరెస్టు కక్ష పూరితమని అభివర్ణించింది.
సుబేదారి వద్ద హై టెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సుబేదారి స్టేషన్ వద్ద రాత్రి నుంచే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సెంట్రల్ జోన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పోలీసులను సుబేదారి పీఎస్ వద్ద మోహరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది. పాడి అరెస్టు కక్ష పూరితమని అభివర్ణించింది.సుబేదారి వద్ద హై టెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సుబేదారి స్టేషన్ వద్ద రాత్రి నుంచే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సెంట్రల్ జోన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పోలీసులను సుబేదారి పీఎస్ వద్ద మోహరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది. పాడి అరెస్టు కక్ష పూరితమని అభివర్ణించింది.
Also Read :
- Rajnathsingh: ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించోవాల్సిందే!
- Veeramallu: వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్