JSK: సెన్సార్​చిక్కులు

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK) చిత్రం చిక్కుల్లో పడింది. ఈనెల 27న సినిమాను థియేటర్ లో రిలీజ్​చేసేందుకు మేకర్స్​ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోగా.. తాజాగా సీబీఎఫ్‌సీ వారికి షాక్​ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ లో ‘జానకి’ అనే పేరును వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాన‌కి హిందూ దేవ‌త పేరు అని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వలేమ‌ని స్పష్టంచేసింది. వెంటనే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'(JSK) చిత్రం పేరును మార్చుకోవాలంటూ సూచించింది. కానీ దీనిని చేంజ్​చేసేందుకు ప్రొడ్యూసర్స్ నిరాక‌రించినట్లు తెలుస్తోంది. ఫలితంగా సినిమా విడుదలకు బ్రేక్ ప‌డింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో లేదో అనే దానిపై స్పష్టత లేదు. కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో జానకిగా అనుపమ.. లాయర్ గా ప్రముఖ నటుడు సురేశ్ గోపి కనిపించనున్నారు.

Also Read :