ENT: శభాష్​ డాక్టర్స్​

ENT

వైద్యులు దేవుడితో సమానమని చెబుతారు. దీన్ని నిజం చేస్తూ హైదరాబాద్‌లోని ప్రభుత్వ (ENT) ఈఎన్‌టీ హాస్పిటల్ మరియు సరోజినిదేవి కంటి ఆస్పత్రి వైద్య బృందం అరుదైన సర్జరీ చేసి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వికారాబాద్ జిల్లా రాపోలే గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కత్తి (ENT) కంట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటన అతని జీవితానికే భయంకర ముప్పుగా మారింది.

సుమారు నాలుగు అంగుళాల పొడవున్న కత్తి అతని కంట్లోంచి ముక్కులోకి దిగిపోయిన ప్రమాదకర స్థితిని చూసిన ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు శస్త్రచికిత్స చేయలేమని తేల్చిచెప్పారు. ఏంచేయాలో తెలియని కుటుంబసభ్యులు రాజేందర్‌ను ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

అక్కడ సూపరింటెండెంట్ ఆనందాచార్య, సరోజినిదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ మోది నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించి పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించింది. ఆ తరువాత వారు అత్యంత నైపుణ్యంతో, సుదీర్ఘంగా సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా కత్తిని కంటి భాగం నుండి సురక్షితంగా తొలగించారు. ఆపరేషన్ విజయవంతమవడంతో ప్రస్తుతం రోగి రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ అపూర్వమైన విజయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఈఎన్‌టీ హాస్పిటల్ మరియు సరోజినిదేవి ఐ హాస్పిటల్ వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా వైద్యులు అత్యుత్తమ సేవలు అందించడాన్ని ఆయన ప్రశంసించారు.

ఈ ఘటన మరోసారి నిరూపించింది – సాంకేతిక పరిజ్ఞానం, వైద్య నైపుణ్యం కలిగిన బృందం చేతుల్లో ప్రాణాలను కాపాడటం సాధ్యమేనని. ప్రైవేట్ ఆసుపత్రులు చేయలేని సర్జరీని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తూ ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నారు.

ఈ ఘటన మరోసారి నిరూపించింది – సాంకేతిక పరిజ్ఞానం, వైద్య నైపుణ్యం కలిగిన బృందం చేతుల్లో ప్రాణాలను కాపాడటం సాధ్యమేనని. ప్రైవేట్ ఆసుపత్రులు చేయలేని సర్జరీని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తూ ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నారు.

Also read: