Nidhi Agarwal: ఆశలన్నీ వాటిపైనే…

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ (Nidhi Agarwal) నిధి అగర్వాల్, తన గ్లామర్‌తో మరియు ఎక్స్‌ప్రెషన్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాల నుంచే ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.

Imageఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక మోస్తరు హిట్ అందుకున్న (Nidhi Agarwal) అందాల భామ, అప్పటి నుంచే వరుసగా అవకాశాలు రావాలని ఆశించింది. కానీ అందుకు అనుగుణంగా అవకాశాలు మాత్రం కలసిరాలేదు.

అయినా కూడా తాను వెనుకడుగు వేయకుండా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉండే రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో మొదటిది హరిహర వీరమల్లు. పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తయారవుతోంది. ఏఎం రత్నం నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నిధికి ఓ కీలక పాత్ర ఇచ్చారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది.

Image

ఇక రెండో సినిమా రాజాసాబ్, ఇందులో నిధి అగర్వాల్‌కు లక్కీ ఛాన్స్‌గా ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఇది కూడా 2025 చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు ప్రాజెక్టులపై నిధి నమ్మకంతో పాటు ఎంతో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు హిట్ అయితే తన కెరీర్‌కు మంచి బూస్ట్ వస్తుందని భావిస్తోంది.

Image

ఇటీవల తన లేటెస్ట్ ఫొటోషూట్‌ నుంచి కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మళ్లీ ఆమె పేరు వైరల్ అయింది. ఆమె గ్లామర్ చూసిన నెటిజన్లు “ఇంత అందంగా ఉండే నిధికి ఇప్పటివరకు సరైన బ్రేక్ ఎందుకు రాలేదు?” అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, “ఈ ఏడాది ఆమెకు తప్పకుండా టర్నింగ్ పాయింట్ అవుతుంది” అని అభిమానులు ధీమాగా అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో నిధి అగర్వాల్ ఆశలన్నీ హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలపైనే ఉండటంలో ఆశ్చర్యం లేదు!

Also read: