PAK: న్యూక్లియర్​ బాలిస్టిక్​ మిస్సైల్స్ తయారు చేస్తున్న పాకిస్తాన్​

ప్రపంచ శాంతికి ముప్పుగా నిలిచే అణ్వాయుధ ప్రోత్సాహక దేశాల్లో పాకిస్తాన్‌ (PAK) ఒకటి. తాజాగా ఈ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిపై దృష్టి సారించిందని యూఎస్ నిఘా సంస్థలు వెల్లడించాయి. అమెరికాను తాకగల సామర్థ్యం గల న్యూక్లియర్ మిస్సైళ్లను (PAK) పాక్ రహస్యంగా అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ (ICBM) సామర్థ్యం 5,500 కి.మీ.ల దూరం మించి లక్ష్యాలను ఛేదించగలదని తెలుస్తోంది. ఇది ఏకంగా అమెరికాలోని పలు కీలక ప్రాంతాలపై దాడి చేయగలదు. చైనా సాంకేతిక సహకారంతో ఈ మిస్సైళ్ల అభివృద్ధి జరుగుతోందని నివేదిక పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ మరియు పీవోకేలోని టెర్రరిస్ట్ క్యాంపులపై ప్రతీకార దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల అనంతరం పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని మరింతగా బలపరిచేందుకు చైనా సహాయంతో అడుగులు వేస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.ఇప్పటికే పాకిస్తాన్ తన వద్ద ఉన్న షాహీన్-3, ఘోరీ వంటి మిడ్రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసింది. కానీ ప్రస్తుతం అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ పాక్ వీటిని దాటి వెళ్లే దీర్ఘశ్రేణి క్షిపణులపై పని చేస్తోంది.

నివేదికల ప్రకారం, ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 170 కి పైగా అణుబాంబులు ఉన్నట్లు అంచనా. భారత్‌తో భవిష్యత్తులో గల గలికల నేపథ్యంలో అమెరికా భారత్‌కు మద్దతు ఇవ్వవచ్చన్న భావనతో పాకిస్తాన్ ఈ ఆయుధాలను రహస్యంగా అభివృద్ధి చేస్తోందని నిఘా నివేదికలు స్పష్టం చేశాయి.ఇలాంటి పరిణామాలు ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. అణ్వాయుధ పరిధిని పెంచే ఈ చర్యలు దక్షిణాసియా భద్రతా పరిస్థితులను ఆందోళనకరంగా మార్చే అవకాశం ఉంది.

Also read: