జూన్ 26 నుండి జూలై 4 వరకు జరిగే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల రాత్రులు (Varahi) గుప్త నవరాత్రులుగా పరిగణించబడతాయి. ఈ సమయంలో శ్రీ మహా (Varahi)వారాహి దేవిని రహస్యంగా పూజించడం విశేషం. లలితా పరాభట్టారిక యొక్క సేనాధిపతిగా శక్తిరూపిణిగా అవతరించిన వారాహి అమ్మవారు దండనాథ అనే బిరుదుతో ప్రశస్తులై ఉన్నారు.
వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఇవి అత్యంత శక్తివంతమైన రాత్రులు. ఈ సమయంలో శ్రీ వారాహి అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.
ఎవరు చేయవచ్చు?
పిల్లలు, వృద్ధులు, పూర్వ సువాసినులు, బ్రహ్మచారులు చేయవచ్చు.
ఉపవాసం అవసరం లేదు, సాత్విక ఆహారం సరిపోతుంది.
ఎలా పూజించాలి?
అమ్మవారి ఫోటో లేదా ప్రింటౌట్ పెట్టాలి
సాయంత్రం 6 గంటలకు పూజ ప్రారంభించాలిబెల్లం పాలకం తీర్థం నైవేద్యంగా పెట్టుకోవాలి
వారాహి సహస్రనామం, కవచం, లలిత సహస్రనామం చదవవచ్చు
9 రోజులు కుదరకపోతే 7, 5, లేదా చివరి 3 రోజులు కూడా చేయవచ్చు
వారాహి అమ్మవారి వైభవం
శ్రీ వారాహి దేవి అనగా లలితా పరాభట్టారిక యొక్క సేనాధిపతి. ఆమె వీరశక్తి, ధాన్యలక్ష్మి, భూదేవి, ప్రాణరక్షకురాలు. వారాహి అష్టభుజాలతో వరాహ ముఖంతో దర్శనమిస్తుంది. శంఖం, చక్రం, హలము, ముసలము, పాశం, అంకుశం, వరద, అభయ హస్తాలతో మనలను కాపాడుతుంది.
ఆమె రథం పేరు కిరిచక్రం, దాన్ని 1000 వరాహాలు లాగుతాయి.
ఆమె రథంలో ధన్వంతరి, అశ్విని దేవతలు కూడా ఉంటారు.
హలము, ముసలము ధరించడం వల్ల ఆమె సస్యదేవత — అంటే పంటల దేవత.
వారాహి అమ్మవారి పూజ ఫలితాలు:
-
అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ వంటి మనోవ్యాధులను నశింపజేస్తుంది
-
ధాన్య సౌభాగ్యం, ఆరోగ్యం, ఆయుష్షు ప్రసాదిస్తుంది
-
శత్రు భయాలు తొలగి శాంతి, విజయాలు లభిస్తాయి
-
భూమాతగా భూమికి బంగారు యుగాన్ని తీసుకురావడమే లక్ష్యం
వర్షాకాలం ప్రారంభంలో భూమిని శుద్ధి చేసి విత్తనాల వేయడం జరగడంతో, ఈ ఆషాఢ నవరాత్రులు ప్రత్యేక ప్రాధాన్యం కలిగినవిగా పరిగణించబడతాయి.
-
జూన్ 26 నుండి జూలై 4 వరకు జరిగే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల రాత్రులు గుప్త నవరాత్రులుగా పరిగణించబడతాయి. ఈ సమయంలో శ్రీ మహా వారాహి దేవిని రహస్యంగా పూజించడం విశేషం. లలితా పరాభట్టారిక యొక్క సేనాధిపతిగా శక్తిరూపిణిగా అవతరించిన వారాహి అమ్మవారు దండనాథ అనే బిరుదుతో ప్రశస్తులై ఉన్నారు.
-
ఈ నవరాత్రుల్లో పూజాచరణ సాయంత్రం 6 గంటలకు ప్రారంభించాలి. పిల్లలు, వృద్ధులు, బ్రహ్మచారులు మరియు పూర్వ సువాసినులు కూడా నైవేద్యం చేయవచ్చు. బెల్లం పాలకం తీర్థం తీసుకోవడం మంచిది. నవరాత్రి పూర్తి 9 రోజులు చేయలేకపోతే, కనీసం 7, 5 లేదా చివరి 3 రోజులు కూడా పూజ చేయవచ్చు. ఉపవాసం అవసరం లేదు, సాత్విక ఆహారంతో పూజ కొనసాగించవచ్చు. అమ్మవారి ఫోటో లేకపోతే ప్రింట్ తీసుకొని పూజా స్థలంలో పెట్టాలి.
-
వారాహి అమ్మవారి స్తోత్రాలుగా వారాయి సహస్రస్తోత్రం, వారాహి కవచం, లలిత సహస్రనామాలు లేదా మీకు తెలిసిన శ్లోకాలు పఠించవచ్చు.
శ్రీ మహా వారాహి దేవి లలితా పరమేశ్వరి ఐదు పుష్పబాణాల నుండి ఉద్భవించిన అష్ట భుజాలతో, వరాహ ముఖంతో ప్రకాశించే శక్తి స్వరూపం. ఆమెకు శంఖం, చక్రం, హలం (నాగలి), ముసలము (రోకలి), పాశం, అంకుశం, వరద ముద్ర, అభయ ముద్రలు ఉన్నాయి. అమ్మవారు భూమాత స్వరూపిణి. ఆమె పూజ వల్ల భూతగాదాలు తొలగిపోతాయి, సస్యశ్యామల భూమిని మనకు అందిస్తారు.
-
ఆమె రథం కిరిచక్రం అనే ప్రత్యేక రథం, దాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి. రథ సారధి స్థంభిని దేవి. రథంలో ధన్వంతరి, అశ్వినీ దేవతల వంటి వైద్యదేవతల పూజ ఉంటుంది. రైతులు భూమిని శుద్ధి చేసి, విత్తనాలు చల్లే కాలం ఇది కాబట్టి వారాహి పూజకు ఇది ఉత్తమ సమయం.
-
వారాహి దేవి ఉగ్రమూర్తిగా కనిపించినా, ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అంతఃశత్రువులైన కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యం వంటి వాటిని నాశనం చేస్తుంది. ఆమెకు ఉపాసన చేయడం ద్వారా విశాల దృష్టి, శాంతి, అభ్యుదయాన్ని పొందవచ్చు.
-
- Varahi Devi: వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు
- Highcourt: మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టండి

