తెలంగాణ రాష్ట్ర రాజకీయ వేదికపై మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖపై బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు(Pradeep rao) తీవ్ర విమర్శలు గుప్పించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించి భారీగా నిధులు ఖర్చు చేసి గెలుపొందినట్లు ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘం సుమోటోగా స్పందించి ఆమె శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.(Pradeep rao)
ఈ రోజు మీడియాతో మాట్లాడిన ప్రదీప్ రావు, “కొండా మురళీధర్ రావు స్వయంగా సమావేశంలో మాట్లాడుతూ తన భార్య గెలుపు కోసం 16 ఎకరాల భూమిని విక్రయించి రూ.70 కోట్లు ఖర్చు చేశానని వెల్లడించారు. ఇది ఎన్నికల నియమాలను ఖచ్చితంగా ఉల్లంఘించడమే. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, కొండా సురేఖ పేరుపై ఒక ఎకరం, మురళీధర్ పేరుపై 13.31 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 500 ఎకరాల భూమి ఉందని చెబుతున్నారు. ఇదేంటో ప్రజలకు బహిర్గతం చేయాలి” అని అన్నారు.
అంతేగాక, ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు. కొండా మురళీధర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చట్టపరంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఖర్చుల పరిమితిని మించి ఖర్చు చేయడం ఓటర్లపై ప్రభావం చూపించే చర్యగా పరిగణించబడుతుందని గుర్తు చేశారు.
ప్రదీప్ రావు మాట్లాడుతూ, “వినూత్న మార్గాల్లో ఎన్నికలలో విజయం సాధించి, మంత్రి పదవి పొందిన కొండా సురేఖ గారు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ప్రజల విశ్వాసాన్ని కల్లోలం చేసే ఈ తరహా వ్యవహారాలను బహిరంగంగా ఒప్పుకున్న వారు పదవుల్లో కొనసాగడం తగదు” అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై కొండా దంపతుల నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే, ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయడం ఖాయం. మురళీధర్ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల వ్యవస్థపట్ల ప్రజల్లో అనుమానాలు కలిగించేలా ఉన్నాయని, ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :

