Rajasingh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

Rajasingh

కొంత కాలంగా బీజేపీలోని కొందరు నాయకుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను అధ్యక్ష పదవిని నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీసుకు వచ్చానని తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని రాజాసింగ్ (Rajasingh) ఈ సందర్భంగా చెప్పారు. తనకు మద్దతుగా ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని అన్నారు. వాళ్లకు ఫోన్లు చేసి పార్టీలో ఉంటావా… సస్పెండ్ చేయాలా..? అంటూ బెదిరించారని ఆరోపించారు. పది మంది సంతకం చేసిన తర్వాతే ఇవ్వాలె. కానీ ఆల్రెడీ వాళ్లే రాష్ట్ర అధ్యక్షుడిని ఫైనల్ చేసేసుకున్నారు. తెలంగాణ లో బీజేపీకి అధికారం రావద్దనుకునే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Image

పార్టీలో తగాదాలు – రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని, ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్లే తనకు అనిపించిందని తెలిపారు. “పది మంది సంతకాలు దొరకాకే నామినేషన్ సమర్పించాలి అని చెబుతున్నారు. కానీ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును ఫైనల్ చేశారంటూ సమాచారం వచ్చింది” అని ఆరోపించారు.

“తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావాలనుకునే వాళ్లు తగ్గిపోతున్నారు. బీజేపీకి అధికారం రావొద్దనుకునే వాళ్లు పార్టీలో పెరిగిపోతున్నారు” అంటూ పార్టీపై తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ, భావోద్వేగంతో మాట్లాడారు.

Image

రాజీనామా ప్రకటన – బీజేపీకి షాక్

ఈ పరిణామం తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్గానే చెప్పుకోవచ్చు. గోషామహల్ నియోజకవర్గం నుంచి అనేకసార్లు గెలిచిన రాజాసింగ్, పార్టీకి ఛాంపియన్ ఫేస్గా గుర్తింపు పొందారు. గతంలో ఆయన కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పార్టీ హైకమాండ్ ఆయన్ను కొన్ని సందర్భాల్లో సస్పెండ్ చేసి, తిరిగి చేర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈసారి మాత్రం పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య సామరస్యం లోపించడం స్పష్టంగా కనిపిస్తోంది. తాజా రాజీనామా ప్రకటనతో బీజేపీ అవమానకర పరిస్థితిలో పడే అవకాశముంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: