CM: తెలంగాణలో మొబైల్ అంగన్‌వాడీలు

CM

తెలంగాణ అంగన్‌వాడీ వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని (CM) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని బస్తీలు, వలస కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లోని చిన్నారుల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని (CM) సూచించారు.

Image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖల మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నతాధికారులతో కలిసి జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.పిల్లల అవసరాలకు తగినవిగా ఆధునిక సాంకేతికతతో కూడిన కంటైనర్ అంగన్‌వాడీల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. వీటిలో సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్ వంటి పరికరాల వాడకంతో తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలిగించవచ్చని అన్నారు. కంటైనర్ మోడల్ కేంద్రాలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలని సూచించారు.

Image

అంగన్‌వాడీల్లో ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం అందించాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. దీనికోసం ఎన్జీవోలు, మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. బాలామృతం ప్లస్‌ను పెద్ద ఎత్తున సరఫరా చేయడం, కర్ణాటక మాదిరిగా జొన్న రొట్టెల వినియోగంపై కూడా నిపుణులతో చర్చించి అమలు చేయాలని సూచించారు.అంగన్‌వాడీలలో పర్యవేక్షణ, నిర్వహణను మెరుగుపరచడానికి వంద రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. అలాగే తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించాలన్నారు.

ఈ ఆలోచనలన్నీ అమలవుతే, అంగన్‌వాడీలు చిన్నారుల అభివృద్ధికి మరింత బలమైన మౌలిక సదుపాయాలుగా మారుతాయి. రాష్ట్రవ్యాప్తంగా వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యం అందించేందుకు ఇది పెద్ద ముందడుగు.

Also read: