దేశవ్యాప్తంగా క్రీడల (Sports) అభివృద్ధికి బలమైన పునాది వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జాతీయ క్రీడా విధానం – 2025కు ఆమోదం లభించింది. ఈ విధానం కేవలం ఆటగాళ్ల శారీరక ప్రమాణాల పట్ల మాత్రమే కాకుండా, వారి సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. దేశవ్యాప్తంగా (Sports) క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, యువ క్రీడాకారులను గుర్తించి శిక్షణ కల్పించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మౌలిక వనరులు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు.
ఈ సమావేశంలో మొత్తం రూ.3 లక్షల కోట్ల విలువైన పథకాలకు ఆమోదం లభించడం విశేషం. ఇందులో ప్రధానంగా ఆర్‌డీఐ – పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (Research, Development, Innovation) పథకానికి రూ.1 లక్ష కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో R&D పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించనున్నారు. తక్కువ వడ్డీ రేటుతో, లేదా వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్ లభ్యమయ్యేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. దీనివల్ల ప్రైవేటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు.
ఈ పథకం అమలు వ్యూహాన్ని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పాలక మండలి రూపొందించనుంది. ఇది దేశీయ పరిశోధన వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చే అవకాశం కల్పిస్తుంది.
ఇది కాకుండా తయారీ రంగంలోని ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకంను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
అంతేకాక, తమిళనాడులోని పరమకుడి–రామనాథపురం హైవే విస్తరణ ప్రాజెక్టుకునూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 46.7 కిలోమీటర్ల పొడవులో హైవే నిర్మాణానికి రూ.1853 కోట్ల వ్యయం మంజూరు చేసింది. ఇది తమిళనాడులో రవాణా మరియు వాణిజ్య అభివృద్ధికి మద్దతు ఇస్తుందని అంచనా.
Also read:
- Uttam Kumar Reddy: బనకచర్ల నిలుపుదల రాష్ట్ర ప్రభుత్వ విజయం
- Ration: రేషన్ బియ్యం తింటున్నారా? అయితే అలర్ట్