Athadu: ఆగస్టు 9న అతడు

తెలుగు సినిమా ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం అతడు,(Athadu) మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు త్రిషా కృష్ణన్ జంటగా నటించిన ఈ క్లాసిక్ మూవీ 2005లో విడుదలై, అప్పటి నుంచి ప్రతి తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై దుగ్గిరాల కిషోర్, ఎం. రామ్మోహన్ కలిసి నిర్మించారు.

ఈ సినిమాలో మహేష్ బాబు పోషించిన నందు / పరశురామ్ పాత్ర, ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందింది. కథ, కథనం, మాటలు, సంగీతం, హాస్యం అన్నీ సమపాళ్లలో మేళవించి, ఓ క్లాసిక్ మాస్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పటికీ టీవీల్లో ప్రసారమైన ప్రతిసారీ ప్రేక్షకులను చక్కటి అనుభూతిలో నిమగ్నం చేస్తోంది.

అతడు సినిమాను ఇప్పటి వరకు టెలివిజన్ చానెళ్లలో అత్యధికంగా ప్రసారం అయిన చిత్రం అనే రికార్డు కూడా ఉంది. అలాంటి సినిమా ఇప్పుడు తాజా టెక్నాలజీ టచ్‌తో మళ్లీ థియేటర్లకు రానుంది. (Athadu)4K రిజల్యూషన్, ఐమాక్స్, డాల్బీ అట్మాస్, సూపర్ 4K ఫార్మాట్స్లో సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ టెక్నాలజీతో, ప్రేక్షకులకు మరింత నాణ్యతైన ఆడియో అనుభూతి కల్పించేందుకు ప్రత్యేకంగా మిక్సింగ్ చేసారు.

ఈ సినిమాలో సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రమణ్యం, హేమ, సుధ వంటి ప్రముఖ నటులు తమ పాత్రలతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ రాసిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకుల నోటిపదులలో వినిపిస్తుంటాయి.

ఈ సినిమాకు మూడు నంది అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా, హాస్యం, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలసిన అతడు, ఇప్పుడు టెక్నాలజీ హంగులతో కొత్త తరం ప్రేక్షకులకు కూడా మళ్లీ పరిచయం కానుంది.

ఈ అద్భుత చిత్రాన్ని 2025 ఆగస్టు 9వ తేదీన గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. అభిమానులు ఈ రోజుకి ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో అతడిని మరోసారి చూడు ముద్దుగా చూస్తారు.

Also Read :