టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న పేరు శ్రీలీల (Sreeleela). తన అందం, అభినయం, ముఖ్యంగా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ అందాల తార ఇప్పుడు పారితోషిక పరంగా కూడా అగ్ర స్థానంలో నిలవబోతోంది. ఇటీవల పుష్ప–2 సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ ‘కిసిక్క్’ ఆమె కెరీర్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లింది.
ఈ సాంగ్‌లో ఆమె చేసిన డ్యాన్స్‌కి సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. గ్లామర్, గ్రేస్, గ్రౌండ్ షేకింగ్ స్టెప్పులతో ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. అందుకే శ్రీలీల క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్ వరకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని రెండింతలు పెంచినట్టు సమాచారం.
ఇంతకు ముందు శ్రీలీల(Sreeleela)ఒక్కో సినిమాకు రూ. 3.5 నుంచి 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేదట. అయితే ప్రస్తుతం ఆమె ఒక్క ప్రాజెక్టుకు దాదాపు రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌లో బజ్. ఈ మేరకు కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది.
‘కిసిక్క్’ స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే ఆమెకు రూ. 2 కోట్లు చెల్లించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై శ్రీలీల ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆమె నిజానికి స్పందించాల్సిన అవసరమూ లేదు, ఎందుకంటే ప్రతిభే ఆమె ఖరీదుకు ఆధారంగా మారుతోంది.
ఇక త్వరలోనే శ్రీలీల బాలీవుడ్‌లో డెబ్యూ చేయబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతుండటం విశేషం. వరుస సినిమాలు, స్పెషల్ సాంగ్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్ తో శ్రీలీల ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది.
శ్రీలీల పారితోషికం పెరగడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను ఏర్పరుస్తుందా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే నటన, డ్యాన్స్, మార్కెట్ కలిపి చూస్తే ఆమె డిమాండ్ నిజమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :

