Kavitha: సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలి  

 

హైదరాబాద్​:  ఢిల్లీ లిక్కర్ కేసును డైలీ సీరియల్ లా లాగుతున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. ఈ కేసులో తానూ బాధితురాలినేనని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్​చాట్​ నిర్వహించి మాట్లాడారు. లిక్కర్ కేసును తన లీగల్ టీం చూసుకుంటుందన్నారు. అది పెద్ద కేసు కాదన్నారు. కేసుపై ఫైట్ చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్​రెడ్డి రేసు గుర్రం కాదు కీలు గుర్రం అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ డీఎన్‌ఏలో బీజేపీ ఉందని, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులల్లో నీళ్లు ఉన్నా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్​ను బద్నాం చేయడానికే కాళేశ్వరంలో నీళ్లు ఉన్న వదలడం లేదన్నారు. తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నట్లు ఉందన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలపై సమీక్ష చేయటం లేదన్నారు. రోస్టర్ విధానంతో మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై శుక్రవారం ధర్నా చౌక్‌ వద్ద దీక్ష చేస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవకపోతే ప్రజలకే నష్టమన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్​చేశారు. (Kavitha)

 

Also read: