ప్రయాణికులకు ఊరట కలిగించే ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసింది. జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీలలో (TollCharges) 50% వరకు తగ్గింపునకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా వంతెనలు (బ్రిడ్జీలు), సొరంగాలు (టన్నెల్స్), ఎలివేటెడ్ రోడ్లు, ఫ్లైఓవర్లు వంటి ప్రత్యేక నిర్మాణాలు కలిగిన రహదారి భాగాలపై ఈ తగ్గింపు (TollCharges) అమలులోకి రానుంది.
ఈ నిర్ణయం లక్షలాది మంది ప్రయాణికులకు నెలసరి ఖర్చుల్లో భారీ ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా రోజూ ప్రయాణించే వాహనదారులకు ఇది గణనీయమైన ఆదా అవుతుంది. ప్రత్యేకంగా నిర్మించిన పద్ధతిలో ఫీజులు విధించే భాగాల్లో ఇప్పటి వరకు అధికంగా టోల్ వసూలు చేస్తున్న ఫాస్ట్యాగ్ సెంటర్లలో భవిష్యత్తులో ఇది మారనుంది.
ఎలా లెక్కిస్తారు కొత్త టోల్ ఛార్జీలను?
సవరించిన నిబంధనల ప్రకారం:
-
మొదట, నిర్మాణం (వంతెన, టన్నెల్, ఫ్లైఓవర్) పొడవును 10తో గుణిస్తారు.
-
తర్వాత, దీనిని మొత్తం జాతీయ రహదారి సెక్షన్ పొడవుతో కలిపి లెక్కిస్తారు.
-
అనంతరం, నిర్మాణ పొడవును మొత్తం పొడవు నుంచి తీసివేస్తారు.
-
అలాగే, జాతీయ రహదారి సెక్షన్ పొడవును 5తో గుణించి మరో విలువను పొందుతారు.
-
ఈ రెండు లెక్కలలో, చిన్న సంఖ్య ఎవరైతే దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.
ఈ విధంగా లెక్కించే పద్ధతిలో పారదర్శకత పెరిగి, ప్రయాణికులపై బరువు తగ్గే అవకాశం ఉంది.
ఈ మార్పులు మానవ సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రైవేట్ వాహనదారులకు ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంగా అధికారులు పేర్కొన్నారు. ఫాస్ట్యాగ్ ద్వారా వసూలు చేసే ఫీజు కూడా తాజా మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయించనున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై అనేక చోట్ల వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ రోడ్లు ఉండడంతో ప్రయాణానికి వేగం పెరిగినప్పటికీ టోల్ బరువు అధికమైందన్న ఆరోపణలు వినిపించాయి. వాటిపై స్పందించిన కేంద్రం తాజా నిర్ణయంతో ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also read:

