Texas: టెక్సాస్ లో వరదలు

Texas

అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రం ప్రస్తుతం ప్రకృతి ప్రకోపంతో బెంబేలెత్తుతోంది. భారీ వర్షాలు, వరదల ధాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, వరదల కారణంగా ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. (Texas) ఇక మరో 25 మందికి పైగా బాలికలు గల్లంతైనట్లు తెలుస్తోంది.

Image

గ్వాడాలుపే నదిలో ఉప్పొంగిన వరదలు

ప్రత్యేకంగా టెక్సాస్ రాష్ట్రంలోని హంట్ ప్రాంతం ఈ ప్రకృతి వైపరీత్యానికి కేంద్రబిందువుగా మారింది. గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహించడంతో పరిసర ప్రాంతాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు నీటమునిగాయి, అనేక రహదారులు చిద్రమయ్యాయి. వీధుల్లోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Image

క్రిస్టియన్ క్యాంప్‌లో బాలికల గల్లంతు

గ్వాడాలుపే నది తీరంలో ఉన్న ఒక ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లో వేసవి శిక్షణాశిబిరం నిర్వహించబడుతోంది. ఈ క్యాంప్‌ను వరదలు ముంచెత్తడంతో 23 నుండి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. వారిని గాలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో కొన్ని వయసు చిన్నారులే కావడం స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.

Image

రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి

ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రజలను సురక్షితంగా బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. వరద ప్రాంతాల్లోకి రెస్క్యూ టీమ్‌లు, హెలికాప్టర్లు, పడవలు సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన బాలికలను గుర్తించేందుకు డ్రోన్లు, GPS ట్రాకింగ్, తక్కువ ఎత్తు విమానాలను ఉపయోగిస్తున్నారు.

Image

హెచ్చరికలు – వర్షం ఇంకా కొనసాగనుంది

సెంట్రల్ కెర్ కౌంటీలో నిన్న రాత్రి ఒక్కసారిగా 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఈ విపత్తు మరింత పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Image

ఈ వరదలతో కలిగిన నష్టం అంతుచిక్కని స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇప్పటికే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కరెంట్ లేకుండా ఉండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతోంది.

Image

Also read: