రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇవాళ అసాధారణ దృశ్యం కనిపించింది. రెంటు బకాయిలపై భవన యజమాని (Rangareddy) అధికార కార్యాలయానికి తాళం వేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏం జరిగింది?
అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రానికి చెందిన రాజు అనే వ్యక్తి తన భవనాన్ని ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. కానీ గత మూడున్నర సంవత్సరాలుగా తనకు అద్దె రాకపోవడంతో, అన్ని స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా కార్యాలయానికి తాళం వేశాడు.
అంతటితో ఆగకుండా, అద్దె మొత్తం చెల్లించే వరకు తాను తాళం తీయబోనని సత్యాగ్రహ శైలిలో భవనం ఎదుట కూర్చున్నాడు. ఈ నిర్ణయం అధికారులను గందరగోళానికి గురి చేసింది. మరోవైపు, స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పౌరులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
ప్రజల ఆగ్రహం
ఈ సంఘటనపై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. “ప్రభుత్వ కార్యాలయాన్ని ఇళ్లలో ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయం? ప్రజల రిజిస్ట్రేషన్ సేవలు ఎందుకు ఇబ్బందుల్లో పడాలి?” అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని స్థాయిల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ అద్దెను ఇవ్వకపోవడం ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రజా సేవలపై ప్రభావం చూపే పరిస్థితి కావడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది సాధారణ సంఘటన కాదు
ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ శాఖల నిర్వహణ లోపాలను, భద్రతా లోపాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను స్వంత భవనాలలో ఏర్పాటు చేసి, తరువాత రెంటు చెల్లించకపోవడం వల్ల ఆస్తి యజమానులకు నష్టం కలుగుతుంది, ప్రజలకు సేవలు అంతరాయం కలుగుతుంది.
Also read:

