Phone tapping: హార్డ్​డిస్కులో సీక్రెట్స్!

తెలంగాణలో రాజకీయాలను తలకిందులు చేసేలా మారుతున్న (Phone tapping) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు రోజుకీ సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో సంబంధించి సిట్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఆయన వ్యక్తిగతంగా వాడిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, దానిపై సాంకేతిక విచారణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) కు పంపించారు.(Phone tapping)

ఈ సాంకేతిక విశ్లేషణలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు కాలవ్యవధిలో సర్వీస్ ప్రొవైడర్ డేటాను సిట్ పరిశీలించగా, మొత్తం 618 ఫోన్ నెంబర్లు గమనించబడ్డాయి. ఈ నెంబర్లలో చాలా వరకు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రాముఖ్యత గల వ్యక్తులైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాకర్ రావు… ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో సంబంధాలు కొనసాగించినట్టు, అలాగే పోలీసు శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో నేరుగా లేదా పరోక్షంగా సంప్రదింపులు జరిపినట్టు సూచనలు ఉన్నాయని సమాచారం. ఈ వ్యవహారంలో నిధుల మదుపు, పలు వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై సిట్ దృష్టి సారించింది.

ఇంతటితో story ముగియలేదు. ప్రభాకర్ రావు వాడిన కొన్ని హార్డ్‌డిస్కులు నాశనం చేయబడ్డాయని, కానీ వాటిలోనే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన డేటా ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ప్రభాకర్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. నివేదికలతో పాటు, సంబంధిత సాక్షుల స్టేట్‌మెంట్లను ఆధారంగా తీసుకొని మళ్ళీ ప్రశ్నించనున్నట్టు సమాచారం.

ఇలా చూస్తే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ, పోలీసు, సాంకేతిక రంగాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వెలువడిన తర్వాత అసలు నిజాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also read: