తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రారంభమైన (IndirammaIndlu) ఇందిరమ్మ హౌసింగ్ పథకంపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చలు ముమ్మరమవుతున్నాయి. ఈ పథకంలో ఎమ్మెల్యేలకు ఇవ్వబడుతున్న కోటా మాదిరిగానే పార్లమెంటు సభ్యులకు కూడా 40 శాతం కోటా (IndirammaIndlu) కల్పించాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు లేఖ రాశారు.
ఎంపీ రఘునందన్ లేఖలో కీలక అంశాలు
ఈ రోజు సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ,
“ఎమ్మెల్యేల మాదిరిగా ఎంపీలూ ప్రజాప్రతినిధులే. అందువల్ల ఇందిరమ్మ ఇండ్లలో ఎంపీలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలకు పార్టీలకతీతంగా అవకాశం కల్పిస్తే, లబ్ధిదారుల ఎంపికలో సమతుల్యత, న్యాయం సాధ్యం అవుతుంది” అని పేర్కొన్నారు.
అంతేగాక, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) నిధులను ఈ పథకంలో వినియోగిస్తున్నందున, పార్లమెంట్ సభ్యులు సహకారం ఉంటే మరింత సమర్థవంతంగా పథకం అమలవుతుందని అభిప్రాయపడ్డారు.
“CMగా వ్యవహరించిన అనుభవం రేవంత్‌కు ఉంది”
రఘునందన్ రావు తన లేఖలో, రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా కూడా పనిచేశారని గుర్తు చేశారు.
“రైతు సమస్యల నుంచి గ్రామీణ అభివృద్ధి వరకూ ఎంపీలకు విస్తృత పరిజ్ఞానం ఉంది. కాబట్టి వారికీ కోటా ఇవ్వడం వల్ల పథకం లక్ష్యాన్ని మరింత వేగంగా చేరవచ్చు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను” అని రాశారు.
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి చెక్?
ఈ ప్రతిపాదనపై ఇప్పటికే వివిధ రాజకీయ వర్గాలు స్పందించడంతో చర్చ ఊపందుకుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎంపీలకు కూడా కోటా కల్పిస్తే, పార్టీలకతీతంగా పేదవారికి ఇళ్లు లభించే అవకాశం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కొందరు నేతలు ఇది రాజకీయ ప్రాధాన్యత పొందే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు.
Also read:

