రాజ్యసభకు నామినేట్ అయిన “సదానంద (Master) మాస్టర్” పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు, సేవా కార్యక్రమాల మేళవింపుగా ఉన్న (Master) జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
కేరళ కమ్యూనిస్టు కుటుంబంలో జననం
సదానంద మాస్టర్ స్వస్థలం కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా. ఆయన ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని అనుసరిస్తూ ఎదిగిన ఆయన, కాలక్రమేణా ఆ ఆలోచనలతో విభేదించి, RSSలో చేరారు. నమ్మకంతో, సేవా ధ్యేయంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జీవితాన్ని మార్చేసిన దాడి – 1994 ఘోరం
1994లో సదానంద మాస్టర్‌పై స్థానిక కమ్యూనిస్టు కార్యకర్తలు కర్కశంగా దాడి చేశారు. ఆ దాడిలో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. తనను ఎదిగించిందనుకున్న వ్యవస్థే ఇలా పతనానికి గురి చేయడం ఆయనను బలంగా మార్చింది. తాను అనుభవించిన బాధను, తీరని నష్టాన్ని సామాజికంగా ఉపయోగపడే విధంగా మలిచారు.
కృత్రిమ కాళ్లపై నడక – విద్యారంగంలో సేవలు
దాడిలో రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ, ఆయన జీవితంపై పట్టుదల మాత్రం చెరిగిపోలేదు. కృత్రిమ కాళ్లపై నిలబడి ఓ టీచర్‌గా, అలాగే ఓ సంఘసేవకుడిగా ప్రజల మదిలో నిలిచారు. విద్యారంగంలో అందించిన సేవలకు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.
రాజకీయాల్లో అడుగులు – మోదీ ప్రచారం
సదానంద మాస్టర్ 2016, 2021 సంవత్సరాల్లో కూత్తువరంబ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున పోటీ చేశారు. అయితే ఆయన గెలవలేకపోయినా, ఆ పోటీలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన కోసం ప్రచారం చేయడం గమనార్హం. ఆయన పోరాటాన్ని గుర్తించి పార్టీ పెద్దలు, కార్యకర్తలు గౌరవించారు.
రాజ్యసభ నామినేషన్ – దేశం గుర్తించిన పోరాట యోధుడు
సదానంద మాస్టర్‌ను ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవం చెల్లించింది. ఇది కేవలం ఓ నామినేషన్ మాత్రమే కాదు, సహనానికి, పట్టుదలకి, దేశభక్తికి లభించిన గుర్తింపు.
Also read:
Secunderabad: ఉజ్జయినీ మహంకాళి బోనాల్లో ఘనంగా ‘రంగం’
Master Raju: ఆర్య సినిమా సెట్స్‌లో విషాదం

