భారతీయులకు గర్వకారణంగా నిలిచే రోజు ఇది. భారత ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ (SubhanshuShukla) శుభాంశు శుక్లా రోదసి ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. యాక్సియం-4 మిషన్ లో భాగంగా, శుక్లాతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు భూమికి సురక్షితంగా (SubhanshuShukla) తిరిగొచ్చారు.
రోదసిలో 18 రోజులు – అనేక ప్రయోగాలు
ఈ బృందం 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో గడిపింది. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక శాస్త్రీయ ప్రయోగాలను అక్కడ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3:01 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్రంలో వారు సురక్షితంగా దిగారు.
శుభాంశుతో పాటు ఈ బృందంలో ఉన్నవారు:
-
పెగ్గీ విట్సన్ – మిషన్ కమాండర్
-
స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ
-
టిబర్ కపులు
స్వస్థలంలో సంబరాలు
శుక్లా స్వస్థలం లఖ్‌నవూ లో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంతో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. తల్లిదండ్రులు, బంధువులు మీడియా ముందుకు వచ్చి గర్వంగా స్పందించారు.
మోదీ ప్రశంసలు
ఈ విజయం మీద ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ,
“ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయుడు శుభాంశు. ఆయన పట్టుదల, అంకితభావం కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇది మన గగన్‌యాన్ మిషన్‌కు దిక్సూచి” అని పేర్కొన్నారు.
Also read: