Jagadish reddy: సీఎం సీటులో విలన్ కూసున్నడు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish reddy) నిప్పులు చెరిగారు. ‘‘సీఎం సీటులో విలన్ కూసున్నాడు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం స్థాయిని దిగజారినట్టు మాట్లాడను: జగదీశ్(Jagadish reddy)

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్ మాట్లాడుతూ –
‘‘ప్రజలు ఆయనను ‘రోత మాటల రేవంత్’ అని పిలుస్తున్నారు. నిన్న తిరుమలగిరి సభలో సీఎం తన సొంత డబ్బా కొట్టుకున్నారు’’ అని ఆరోపించారు.

రేషన్ కార్డుల గణాంకాలపై చర్చ.

బీఆర్‌ఎస్ పాలనలో 6,47,000 రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పిన జగదీశ్ రెడ్డి –
‘‘ఇది నిజమని భట్టి విక్రమార్క గారు స్వయంగా ట్విట్టర్‌లో పెట్టుకున్నారు. మేము ఏం చేయలేదని అంటే, నేను చెంపదెబ్బకు సైతం సిద్ధంగా ఉన్నా’’ అంటూ ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్, టీడీపీపై విమర్శలు.

‘‘ప్రజలను పీడనలో ఉంచిన పార్టీ కాంగ్రెస్. దానికి మొదటి ద్రోహి. రెండో ద్రోహి చంద్రబాబు. అదే రేవంత్ రెడ్డి గురువు. నీళ్ల విషయంలో సీఎం అజ్ఞానాన్ని బయటపెట్టారు’’ అని ఆరోపించారు.

కాళేశ్వరం అంశంపై సవాలు.

‘కాళేశ్వరం కొట్టుకుపోయిందని బీజేపీ, చంద్రబాబు చేస్తున్నది అబద్ధ ప్రచారం. ఎక్కడైనా, ఏ పంప్‌హౌస్ దగ్గరైనా చర్చకు సిద్ధం. సీఎం అయినా, మంత్రులైనా రండి, ముఖాముఖి మాట్లాడదాం’’ అంటూ సవాలు విసిరారు.

Also Read :